చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు…

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు. దీని పై ఉత్తర్వులు జారీ చేసారు నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్. వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటల పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 185 చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది నీటిపారుదలశాఖ. ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పనులు చేయనున్నాయి. ప్రత్యేక బృందాలు చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు.

-Advertisement-చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు...

Related Articles

Latest Articles