లోకేష్ కోసం త్యాగపురుషుడిగా మారుతోన్న చంద్రబాబు?

పుత్సవాత్సల్యం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆ ప్రేమలో ఉన్నవారు ఆఖరికి చావడానికైనా.. చంపడానికి సిద్ధమవుతుంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీలోనూ అదే సీన్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన పుత్రుడు లోకేష్ ను ఎలాగైనా రాజకీయంగా యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. ఆయనకు వయోభారం మీద పడుతుండడంతో ఇప్పుడు లోకేష్ ఎదగడం చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. ఈ కారణంగానే ప్రస్తుతం టీడీపీని ప్రయోగశాలగా మార్చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతలనే నుంచే విన్పిస్తున్నాయి. చంద్రబాబు వయస్సు ప్రస్తుతం 71ఏళ్లు. ఈ కారణంగానే ఆయన మునుపటిలా రాజకీయాలు యాక్టివ్ గా చేయలేకపోతున్నారు. యువ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు వ్యూహాలు పెద్దగా పని చేయడం లేదు. పాతచింతకాయ పచ్చడి ఫార్మూలాను జగన్మోహన్ రెడ్డి చిత్తుచిత్తు చేస్తూ టీడీపీని భూస్థాపితం చేసేలా ముందుకెళుతున్నారన్న టాక్ నడుస్తోంది.. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు అనుభవాన్ని బయటికి తీయాల్సిందిపోయి పుత్సవాత్సల్యంతో తప్పడుగులు వేస్తున్నారనే ప్రచారం టీడీపీ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.

చంద్రబాబు వయస్సుపైబడిన ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా యాక్టివ్ గానే ఉండటం టీడీపీకి కొంచెం కలిసొచ్చే అంశం. కేవలం ఆయన పాతఫార్మూలానే పట్టుకొని వేలాడుతుండటంపైనే టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడిగా మీరే ఉండాలని వారంతా కోరుతున్నారు. మీ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు టీడీపీ వెళ్లాలని టీడీపీ సీనియర్లు చంద్రబాబును కోరుతున్నారు. ఆయన మాత్రం లోకేష్ నాయకత్వంలో 2024 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో లోకేష్ బాబు కెపాసిటీని అర్థం చేసుకున్న టీడీపీ సీనియర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీలో గత కొన్నిరోజులుగా నాటకీయ పరిణాలు చోటుచేసుకుంటున్నాయి. లోకేష్ ను సమర్థించే వారికి పార్టీలో ప్రాధాన్యం లభిస్తుండగా వ్యతిరేకించే వారిని పొమ్మనలేక పొగబెడుతున్నారట. ప్రస్తుతం నారా లోకేష్ కేంద్రంగానే చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీకి భవిష్యత్ ఉండదని ముందుగానే ఊహించిన నేతలంతా తట్టబుట్ట సర్ధుకొని సీఎం జగన్ వైపు చూస్తున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే గోడదూకేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాలను తొలిసారి ఎదుర్కొన్న నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీలో భవిష్యత్ సీఎంగా ప్రొజెక్టు అవుతున్న నారా లోకేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం చంద్రబాబును కుంగదీసింది. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో లోకేష్ కోసం చంద్రబాబు తన సీటును త్యాగం చేయబోతున్నారట. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కుప్పం సీటును లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం చేయబోతున్నారని సమాచారం. నారా ఫ్యామిలీకి కుప్పం బాగా అచ్చివచ్చింది. ఇక్కడి నుంచి గెలిచే చంద్రబాబు సీఎంగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారు. తనకు సెంటిమెంట్ గా వస్తున్న కుప్పాన్ని లోకేష్ కట్టబెట్టడం ద్వారా అతడి జాతకాన్ని మార్చాలని భావిస్తున్నారు. మరోవైపు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారని తెలుస్తోంది. దీని వల్ల తనకు పదవుల ముఖ్యంకాదని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే నారా లోకేష్ నాయకత్వంపై టీడీపీ శ్రేణులకు నమ్మకం కుదరడం లేదట. దీంతో వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే పార్టీ పూర్తిగా మునగడం ఖాయమని సీనియర్లు బాబు దృష్టికి తీసుకెళుతున్నారట. అయితే చంద్రబాబు మాత్రం పుత్సవాత్సల్యంతో ఎవరి మాట పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో గాలిలో దీపం చందంగా టీడీపీని ఆ భగవంతుడే కాపాడాలంటూ ఆ పార్టీ నేతలు లోలోపల మథనపడుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-