అనంతగిరి కొండల్లో ఆగని తుపాకుల మోత…!

హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ తుపాకుల మోత మోగుతూనే వుంటుంది. అనంతగిరి కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం వేటగాళ్లు తుపాకులకు పని చేపు తునే ఉన్నారు. అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రం కావడంతో అక్కడ నిత్యం ఏదో ఒక సందడి ఉంటుంది. అయితే కొంత మంది వేటగాళ్లు స్వేచ్ఛగా అక్కడ హంటింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరొకసారి వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో అర్ధరాత్రి సమయంలో తుపాకుల మోత వినిపించింది.

తుపాకుల మోతలు.. మందుబాబుల ఆగడాలతో అనంతగిరి అడవుల్లో అలజడులతో నిత్యం జనం జంకుతున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి నిత్యం పర్యాటకుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంది.‌ హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా అనంతగిరి అడవులు, కొండ కొనలు, చెరువులు ఉండడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ పర్యాటక కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది మందుబాబులు రెచ్చిపోతున్నారు. అడవిలో ఎక్కడ బడితే అక్కడ తాగిపడేసిన సీసాలు…వ్యర్ధ పదార్ధాలతో కనిపిస్తోంది. అనంతగిరి చూట్టూ పదుల సంఖ్యలో రిసార్ట్స్ లు ఉండడంతో వాటిలో రాత్రి బస చేసేందుకు వస్తున్న యాత్రికులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అడవుల్లో పర్యటనకోసం వచ్చే కొంతమంది బడానాయకుల పిల్లలు తమవెంట తూపాకు తీసుకొచ్చి రాత్రి సమయంలో హంటింగ్ (వేట) కోసం అడవుల్లో తిరుగుతూ గన్ లో శబ్దంతో మారుమోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాలపై స్థానికులు అటవిశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అటవిశాఖ అధికారులకు పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో గాని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో మాత్రం చూపడంలేదని ఇక్కడి పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అడవుల్లో వేసే వ్యర్దాలను తింటు, ఓవర్ స్ఫిడ్ తో వెళ్తున్న వాహనాలు తగిలి నిత్యం వణ్యమృగాలు మృత్యువాత పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ అడవి ప్రాంతంలో నుంచి రహదారిలో గ్రామాల ప్రజలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. గతంలో వికారాబాద్ జిల్లా లో వేట వాళ్ల బారిన పడి ఎన్నో మూగజీవాలు మృత్యు వాతపడిన ఘటనలు ఉన్నాయి. అనంతగిరి అడవుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై స్పందించేందుకు అటవిశాఖ, పోలీస్ శాఖ అధికారులు స్పందించేందుకు ఇష్టపడడం లేదు ‌ ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనంతగిరిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

: Ramesh Vaitla

-Advertisement-అనంతగిరి కొండల్లో ఆగని తుపాకుల మోత…!

Related Articles

Latest Articles