రచ్చకెక్కుతున్న చేసుకున్నబెజవాడ టీడీపీ విభేదాలు…

విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్‌ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్‌ అయోమయంలో పడుతోందట..

బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న టిడిపి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రచ్చకెక్కి మరీ విమర్శలు చేసుకున్నారు బెజవాడ టీడీపీ నేతలు అప్పటి నుండి కేశినేని నాని, బోండా ఉమా, బుద్ధా, నాగుల్ మీరా ఇంకా కలవలేదట. కలవని మనసులతో కలహాల కాపురాన్నే కొనసాగిస్తున్నారట. దీంతో పార్టీ క్యాడర్ కూడా తలొదిక్కు చూస్తున్నారట.

బెజవాడ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు బ్రేక్ పడటం లేదు. గతంలో కలిసి కట్టుగా ఉండి పార్టీకి విజయాన్ని అందించిన నేతలే ఇప్పుడు పార్టీ బలహీనపడటానికి కారణంగా మారుతున్నారట. 2014 ఎన్నికల సమయంలో మొదటిసారి ఎంపీగా పోటీచేసిన కేశినేని నాని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోండా ఉమా ఒకజట్టుగా ఉన్నారు. వీరికి ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్న కూడా జతకలిశారు. బుద్ధా వెంకన్న నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉండి అందరిని సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేశారు. 2014లో నగరంలో ఉన్న 3 అసెంబీ సీట్లలో రెండిటితో పాటు, ఎంపీ స్థానం కూడా టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ 38 సీట్లు గెలిచి అధికారాన్ని కైవశం చేసుకుంది. అధికారంలో ఉన్నంతకాలం బాగానే ఉన్న సంబంధాలు విపక్షంలో చేరాక మాత్రం బెడిసికొట్టాయి.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఎంపీ కేశినేని నాని, బోండా ఉమాల మధ్య సంబంధాలు చెడాయనేది పార్టీ వర్గాల మాట. బోండా ఉమాకి మంత్రి పదవి రాకపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చిన వారిలో కేశినేని నాని ఒకరు. అప్పట్లో వీరందరికీ ఉమ్మడి శత్రువుగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉండేవారు. అయితే ఇప్పుడు దేవినేని ఉమా బెజవాడ రాజకీయాల్లో అంతగా జోక్యం చేసుకోవటంలేదట.

గతంలో సన్నిహితంగా మెలిగిన కేశినేని నాని, బోండా ఉమా మధ్య విబేధాలు వచ్చిన సమయంలోనే కేశినేని, బుద్దా వెంకన్న మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది. బుద్ధా, కేశినేని నాని ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పక్క పార్టీ నేతలకు, ప్రజల మధ్య చులకనయ్యేంత పరిస్థితి వచ్చింది. ఆ దశలో అధిష్టానం వారి రగడకు బ్రేక్ వేసింది. అయితే ఈ వివాదాలకు కామా మాత్రమే పెట్టారని ఫుల్ స్టాప్ పెట్టలేదట. ఈ విషయం మూడు నెలల క్రితం రచ్చకెక్కిన విబేధాలతో మరోసారి స్పష్టమైంది. 3 నెలల క్రితం ఈ రగడ జరిగినపుడే పార్టీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇరువర్గాలకు నచ్చచెప్పారు. అయినా కూడా ఇంకా పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదట.

పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా ఇంకా బెజవాడ నేతలు మాత్రం ఒకరిపై మరొకరు గుర్రుగానే ఉన్నారట. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను సైతం గతంలో కేశినేని భవన్ లో నిర్వహించి అందరూ అక్కడకు వెళ్ళి కచ్చితంగా పాల్గొనే వారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట. అధినేతకు సంబంధించి కార్యక్రమాల్లొ పాల్గొనటంలో కూడా అందరూ కలిసి ఉండటానికి సుముఖత వ్యక్తం చేయటంలేదట నేతలు. అధినేత కార్యక్రమాల్లో తప్పనిసరై పాల్గొన్నా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారట.

సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంపీ అనుచరులు కొందరు విడిగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్పాలు చేస్తున్నారట. బెజవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు ఇన్చార్జిలు ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి ఇన్చార్జి లేరు. దీంతో ఈ స్థానానికి రెండు వర్గాల నుంచి తీవ్రమైన పోటీ నెలకొందట. ఇక్కడ ఎంపీ కుమార్తె కేశినేని శ్వేత 3 డివిజన్లలో పర్యటించి టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులు చనిపోతే పరామర్శించారు. దీనిపై బుద్ధా వెంకన్న నాగుల్ మీరా వర్గాలు గుర్రుగా ఉన్నాయట. పశ్చిమలో వరుస పర్యటనలు చేయాలని ఈ నేతలు భావిస్తున్నారట. నేతల మధ్య లుకలుకలతో క్యాడర్ తలలు పట్టుకుంటోందట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-