ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్.. ఆర్టీసీకి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారా?

వీసీ సజ్జనార్. అది పేరు కాదు. బ్రాండ్. మహిళలను వేధించే వారి ప్రాణం తీసే బ్యాండ్. పోలీస్ పవర్ కు ఆ పేరు కేరాఫ్. నేషనల్ లెవల్లో కాదు.. ఇంటర్నేషనల్ లెవల్లో రాష్ట్ర పోలీసుల ప్రతాపాన్ని మార్మోగించిన వ్యక్తి ఆయన. ఇంతటి పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. కీలక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించిన పేరున్న అధికారి.. ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి బాస్ అయ్యారు. ఎండీగా ఇవాళే బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ అధికారిగా దూకుడుగా పని చేసిన ఆయన.. ఇప్పుడు ఆర్టీసీ ని ఎలా ముందుకు తీసుకెళ్లనున్నారు? తన దూకుడుతో ఆర్టీసీ బస్సుల గేర్ ఎలా మార్చనున్నారు?

ఇప్పటికే.. రాష్ట్ర ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది. గతంలో పని చేసిన ఎండీలు బాగుపరచలేకపోయారు. ప్రభుత్వం ఎంతో కొంత సహాయాన్ని అందిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో సంస్థను ఆదుకోవడం లేదు. కరోనా కారణంగా వచ్చిన రెండు లాక్ డౌన్లతో సంస్థకు తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. వాటిని సవరించుకునేందుకే.. సమయం దొరకడం లేదు. పైగా.. పెరుగుతున్న చమురు ధరలు.. సంస్థ పాలిట గుదిబండగా మారుతున్నాయి. బస్సులు సైతం పాతబడుతున్నాయి. మరమ్మతులకే కోట్లాది రూపాయలు ఖర్చవుతోంది.

ఇన్ని సమస్యల సుడిగుండంలో ఉన్న ఆర్టీసీకి.. బాస్ గా వచ్చిన సజ్జనార్.. ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతున్నారన్నది.. చాలా మందిలో ఆసక్తిని రగిలిస్తోంది. పోలీస్ అధికారిగా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఈ సమస్యలను ఎలా ఎన్ కౌంటర్ చేస్తారన్నదే.. ఇంట్రెస్టింగ పాయింట్ అయ్యింది. ముందు సంస్థపై.. భారాన్ని తగ్గించి.. ఆ తర్వాత సేవల్లో ముందుకు తీసుకుపోవాలన్నదే ఆయన ప్లాన్ గా కొందరు భావిస్తున్నారు.

ఈ క్రమంలో.. ఇటీవల ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ ఆప్షన్ ప్రచారంలోకి వచ్చింది. ఆ విధానాన్ని సమర్థంగా అమలు చేసి.. కాస్త భారాన్ని తగ్గించుకుంటే.. అప్పుడు పరిమితమైన స్టాఫ్ తో.. మరింత ఎక్కువ సేవలు అందించి.. పరిమిత కాలంలోనే సంస్థను పరుగులు పెట్టించాలన్న ఆలోచన సజ్జనార్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆర్టీసీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఏది ఏమైనా.. పోలీసు అధికారిగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సజ్జనార్ సొంతం.

గతంలో ఆయన చేసిన కొన్ని ఆపరేషన్లతో.. వ్యవహరించిన తీరుతో.. జాతీయ స్థాయిని దాటి.. అంతర్జాతీయ వార్తా పత్రికల్లోనూ చోటు పొందిన డైనమిక్ ఆఫీసర్ ఆయన. అలాంటి సమర్థుడైన అధికారి ఆర్టీసీకి బాస్ గా రావడం.. సంస్థను గాడిలో పెట్టడానికే.. అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. మాకూ మంచిదే కదా.. అని కార్మిక వర్గాలు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-