కమలంలో ఉన్న మాజీ టీడీపీ నేతల అసంతృప్తి

హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్‌ కాలేదని భావిస్తున్నారట.

కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్‌ ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తోంది.

తెలంగాణ బీజేపీలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక చేరికలు జరిగాయి. ఇందులో ప్రముఖ నేతలతో పాటు, ఎదుగుతున్న నేతలు కూడా అనేకమంది ఉన్నారు. ఇంకా జాయిన్‌ అవుతూనే ఉన్నారు. అయితే, పార్టీ మారేటపుడు నేతలు కొన్ని హామీలతో కండువాలు కప్పుకుంటారు.
కమలం పార్టీలో చేరి చాలా కాలమైనా ఇంకా తమకు న్యాయం జరగలేదని కొందరు నేతలు భావిస్తున్నారట

ముఖ్యంగా టిడిపి నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం వారిలో తమకు పదవుల విషయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉందట పార్టీ సంబంధించిన కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదట పెద్ద ప్రోగ్రాం ఉన్నా ఎవరో చెబితే కానీ తెలియడం లేదట. రీసెంట్ గా మాజీ మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తి ని బహిరంగంగా నే వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితి ల నేపథ్యం లో ప్రస్తుతం కామ్ గా ఉన్నా, భవిష్యత్తు లో ఆయన పార్టీ లో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… టియ్యారెస్‌ లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరో నేత మోత్కుపల్లిని సీఎం సమావేశానికి వెళ్ళొద్దని పార్టీ చెప్పినా ఆయన మాత్రం వెళ్ళారు. ఇప్పటికే కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా, అసంతృప్తి మాత్రం తీవ్రంగానే ఉందట. అటు దేవేందర్ గౌడ్ కుమారులు బీజేపీ లోనే ఉన్నా… ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది… వీరేందర్ గౌడ్ కి పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే అభిప్రాయాలున్నాయి

మాజీ ఎంపీ గరిక పాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు…గతంలో ఉన్నంత యాక్టివ్‌ గా ఆయన లేరనే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఆయన తో పాటు పార్టీ లో చేరిన వారిలో మరి కొందరు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కమలం తీర్థం కొందరికి మాత్రమే సరిపడిందని, చాలామందికి వంటబట్టలేదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. పార్టీలో ఇమడలేని పరిస్థితి వస్తోందని భావిస్తున్నారట. ఈ పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో కమల దళం నుండి బయటకు వెళ్లే నేతలు ఎవరా అనే చర్చ నడుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-