ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన పదవుల వ్యవహారం !

పదవులిచ్చారు. కొత్త తంటా తెచ్చారని ఈ ఎమ్మెల్యేలు విసుక్కుంటున్నారట. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని సన్నిహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలీటం లేదట. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల చైర్మన్‌ పదవులు స్థానిక ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. సొంత వారిని కాదని ఇతర ప్రాంతాల వారికి ఎలా ఇస్తారని నిలదీస్తున్నారట.

చిత్తూరు జిల్లాలో పదవుల పంపకాలు బాగానే జరిగినా, ఆ రెండు ఆలయాల చైర్మన్‌ గిరి మాత్రం వివాదంగా మారింది. ఎమ్మెల్యేకి నామినేటెడ్ పదవుల వ్యవహారం పెద్దగా తలనొప్పిగా మారిందట పదవిని సోంత నియోజకవర్గం వారికి కాకుండా పక్కవారిని ఎలా ఇస్తారంటూ… అ ఇద్దరు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారట అనుచరులు…. ఇప్పుడిదే ఇదే అ జిల్లా హాట్ టాపిక్ గా మారింది..

నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చిత్తూరు జిల్లాలో కాక రేపుతోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం.. జిల్లాలో తిరుమల తర్వాత రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలు. ఈ ఆలయాల పాలక మండళ్ల చైర్మన్ పదవులను తొలిసారిగా స్థానికేతరులకు ఇచ్చారు. ఈ నిర్ణయం శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్న స్థానిక వైసీపీ నేతలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. మరోవైపు కాణిపాకం ఆలయానికి స్థానికేతరులకు ఇవ్వడంపై కూడా ఇదే స్పందన కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. పోలీసు కేసులు ఎదుర్కొన్నాం. పార్టీ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాం. అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందనుకున్నాం. రెండేళ్లు దాటి పోయినా ఏ పదవీ లేదు. చివరికి ఆలయ చైర్మన్ పదవుల్లోనూ అన్యాయం జరిగిందంటున్నారట

ఈ విషయంలో శ్రీకాళహస్తీ వైసీపీ నేతలు… ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ చూట్టు తిరుగుతూంటే …కాణిపాకం ఆలయ చైర్మన్ విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్థానికేతరుడు, సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్రవర్మను నియమించారు. అయితే ఈ పదవిని స్థానిక నేతలు చాలామంది ఆశించారు. ఇప్పుడు వారంతా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ జ్ఞానేంద్రర్ రెడ్డి వదిన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డిని నియమించారు. దీనిపై కూడా ఉభయదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ విషయం ఎమ్మెల్యే ఎం.ఎస్‌ బాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదంటూ, ధర్నాకు కూడా దిగారు. చైర్మన్ పదవి స్థానికేతరులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించి స్టే తెస్తామన్నారు. ఉభయదారులే కాకుండా పూతలపట్టు వైసీపా నేతలు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు

దీంతో ఈ పదవుల వ్యవహారం తమకు తెలియకుండానే జరిగిందంటూ సర్దిచెప్తున్నారట ఎమ్మెల్యేలు అటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ తన అనుచరులకు పదవి ఇప్పించాలని కోరినప్పటికీ, జిల్లా మంత్రి ఒత్తిళ్ల కారణంగా స్థానికేతరుడికి వచ్చిందని టాక్‌ నడుస్తోంది. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కాదని స్థానికేతరులకు చైర్మన్ పదవి ఇస్తే, తనను నమ్ముకున్న వారికి ఏం సమాధానం చెప్పాలా అని ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారట. అటు ఎమ్మెల్యేలు సర్ది చెప్తున్నా, స్థానిక నేతలు మాత్రం నమ్మటం లేదట. దీంతో ఆలయ చైర్మన్ పదవుల వ్యవహారం ఎలాంటి పరిస్థతులకు దారి తీస్తుందో అనే ఆందోళన చిత్తూరు వైసీపీ వర్గాల్లో నెలకొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-