హుజూరబాద్ లో పోటీకి నో అంటే నో అంటున్న పొన్నం…

ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు టిక్కెటిస్తాం అంటే నాయకులెవరైనా ఎగిరి గంతేస్తారు..కానీ ఈ కాంగ్రెస్‌ నేత మాత్రం హుజూరాబాద్‌ లో పోటీకి నో అంటున్నారట. పోటీ చేసేది లేదంటే లేదని తేల్చేశారట. ఈ మాజీ ఎంపీ పోటీచేయనని చెప్పటానికి కారణం ఏంటి?

హుజూరాబాద్ అభ్యర్ధి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వేట మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఈ పనిలో వ్యూహరచన చేస్తుంటే, కాంగ్రెస్ ఈ కసరత్తులో కొంత వెనుకబడింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములాంటిదే అని చెప్పాలి. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ trs కండువా కప్పుకుంటున్నారు. అయితే ఈ దశలో కౌశిక్ బయటకు వెళ్ళిపోవడమే బెటర్ అని పిసిసి కూడా భావిస్తోందట.

కానీ, ఇప్పటి వరకు గెలుపు..ఓటముల మీద అంచనాలు వేసుకునే పరిస్థితి నుండి..అభ్యర్ధి ఎంపిక కోసం తంటాలు పడే పరిస్థికి వచ్చింది కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో నిలిపేందుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేరుని పరిశీలిస్తోంది. అయితే… పొన్నం మాత్రం పోటీ చేసేది లేదని స్పష్టం చేశారట. పిసిసి చీఫ్ రేవంత్… దామోదర రాజనర్సింహలకు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పారట. అటు పార్టీ ఇంఛార్జి ఠాగూర్ కూడా పొన్నం కి మిత్రుడే…ఆయన కి కూడా పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారట.

బీసీ సామాజికవర్గానికి చెందిన పొన్నంను బరిలో నిలిపితే పార్టీ కి కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మళ్లీ ఎన్నికల బరిలో నిలబడటం సరి కాదని… తనను ఒత్తిడి చేయొద్దని కూడా పొన్నం తేల్చేశారట. దీంతో ఆయన ఇంతగా వద్దనటానికి కారణం ఏమిటనే చర్చ కూడా నడుస్తోంది. ఓ దశలో పొన్నం పార్టీ మారతారా..? అనే టాక్ కూడా మొదలైంది.
దీంతో ఆ విషయంపై కూడా పార్టీకి క్లారిటీ ఇచ్చారట. పార్టీ మారనూ… పోటీ చేయను అని చెప్పేశాడట.

పొన్నం ప్రభాకర్…2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వత వచ్చిన ఎంపి ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌ సభ స్థానంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు ఓటములతో, రాజకీయంగా దెబ్బతినటమే కాక, అసెంబ్లీకి పోటీ చేయకుండా ఉండాల్సిందని భావించారట.

అయితే వరుసల ఓటముల నుండి తేరుకునేలోపు హుజూరాబాద్ కి ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువని పొన్నంని బరిలో దించాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తున్నా… ఫలితాలు అనుకూలంగా రాకుంటే .. పొన్నం ప్రభాకర్ ఖాతాలో రెండున్నర ఏండ్లలో మూడు ఓటములు చేరుతాయి. ఇది రాజకీయంగా… పొన్నంకి నష్టం కలిగించే విషయమే. దీంతో ఈ పరిస్థితిలో మళ్లీ హుజురాబాద్ నుండి బరిలో ఉండటం సరికాదని ఆయన భావిస్తున్నారట. అందుకే హుజూరబాద్ లో పోటీకి నో అంటే నో అంటున్నారట పొన్నం.

హుజూరాబాద్ లో ఎన్నికలు కాంగ్రెస్‌, బీజెపీకు ప్రతిష్టాత్మకం అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి చోట పోరాడాలంటే ఆర్ధికంగా కూడా బలంగా ఉండాల్సిందే. ఇప్పుడు పార్టీ కూడా అలాంటి సాహసం చేస్తుందనే కూడా నమ్మకం పొన్నం ప్రభాకర్‌ కు లేదు. ఇలాంటి పరిస్థితిలో బరిలో దిగి దెబ్బతినడం కంటే .. సైలెంట్‌ గా ఉంటేనే గౌరవం దక్కుతుందని భావిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-