వడ్డాణం మంత్రికి వచ్చిన కష్టం ఏమిటి…?

ఏపీ లో వడ్డాణం మంత్రి ఎవరా అంటే తెలియని వారుండరు. 2014 లో ఆమె మంత్రిగా పని చేసిన ఆమె వ్యవహారశైలితో మోస్ట్ పాపులర్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారింది. చివరికి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నారట. ఆ మాజీ మంత్రి కష్టాలేంటి?

పీతల సుజాత.. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత… మంత్రిగా కీలక శాఖలు చూసుకున్న ఆమె ప్రస్తుతం తనరాజకీయ మనుగడపై చాలా టెన్షన్ పడుతున్నారట.పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో 2014లో గెలిచి మంత్రి కుర్చీని సొంతం చేసుకున్న ఆమెతరువాత జరిగిన పరిణామాలతో మంత్రి పదవితో పాటు, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. దీంతో ఆమె సీనియర్లని పట్టించుకోలేదు, క్యాడర్ ని కాపాడుకోలేదు, దీంతో వర్గ విబేధాలతో 2019 ఎన్నికల్లో అక్కడి సీటు కూడా కోల్పోయారు. ఆ స్థానాన్ని అక్కడ పట్టున్న కర్రా రాజారావు కి కేటాయించింది టీడీపీ అధిష్టానం…

అయితే, 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌ లో కర్రా రాజారావు ఓటమిపాలయ్యారు.కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో కర్రా రాజారావు మృతి చెందారు. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి పదవి ఇప్పటికి ఖాళీగా ఉన్న పరిస్థితి.క్యాడర్ కూడా స్తబ్దుగా అయ్యారు.దీంతో ఇంచార్జి పదవి కోసం నేతల పైరవీలు కొనసాగుతున్నాయట.

ఈ సమయంలో పోయిన చోటే వెతుక్కోవాలని మాజీ మంత్రి పీతల సుజాత మళ్లీ ఎంటరయ్యారు,. ఇంచార్జ్‌ కోసం పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేస్తున్నారట. మంత్రి పదవి కట్టబెడితే, వివాదాల్లోకి వెళ్లటమే కాకుండా, నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నడిపించలేకపోయారు పీతల. ఆ తర్వాత సీటు రాకపోవటంతో పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి, ఆమె సైలెంట్‌ అయ్యారు. ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇంచార్జ్‌ పదవి సంగతి తెరపైకి రాగానే… మళ్లీ లైన్లోకి వచ్చిన ఈ మాజీ మంత్రి.. ఫంక్షన్లకు పిలవటమే ఆలస్యం హాజరైపోతున్నారట. వర్గ విభేదాలు, సీనియర్లని కలుపుకోలేకపోవటం వంటి కారణాల తో సీటు కోల్పోయిన పీతల సుజాత కి అధిష్టానం ఆశీస్సులు మళ్లీ ఉంటాయో లేదో చూడాలి.

అయితే చింతలపూజి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అవటం తో ఆశావహులు కూడా చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ జడ్పి చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు కి అధిష్టానం అవకాశం కల్పిస్తుందని ఆయన అనుచరగణం భావిస్తోంది.2019 ఎన్నికల్లో సీటు ఆశించి చివరి క్షణం లో సీటు కోల్పోయిన జయరాజు ఈ సారి ఇంచార్జి పదవి తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అడపాదడపా తిరుగుతూ పీతల సుజాత, కొక్కిరిగడ్డ జయరాజు అధిష్టానం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. మరి అధిష్టానం మదిలో మెదిలో ఆ వ్యక్తి ఎవరో కొద్దీ రోజుల్లో తేలనుంది…

Related Articles

Latest Articles