ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌పై అధికారుల్లో చర్చ…!

ఏపీ సీఎంవోలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆయనకు కత్తెర పడింది. ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పించారు. తిరుగే లేదని అనుకున్న IAS విషయంలో సడెన్‌గా ఈ ట్విస్ట్‌ ఏంటి? ఎందుకు కోత పెట్టారు? అధికారుల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా అధికారి? లెట్స్‌ వాచ్‌!

ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌పై అధికారుల్లో చర్చ

ప్రవీణ్ ప్రకాష్. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో మిగిలిన ఐఏఎస్సుల్లాగానే ఈయనా ఓ ఐఏఎస్‌. కాకపోతే సీఎంవోలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల గురించి రాజకీయవర్గాల్లో చర్చ సహజం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాష్‌పైనా అలాంటి టాపిక్కే హాట్‌ హాట్‌గా ఉంది. అడపా దడపా ప్రభుత్వంలో జరిగే కొన్ని తప్పిదాలకు సీఎం జగన్‌ కంటే ప్రవీణ్‌ ప్రకాష్‌ కారణమనే వాదన చాలా బలంగా వినిపిస్తోందట. ఈ క్రమంలోనే ఆయనపై ఇతర ఐఏఎస్‌లు.. నేతలు గుస్సాగా ఉన్నారట. నలుగురు ఐఏఎస్‌లు లేదా నలుగురు ప్రజాప్రతినిధులు కలిసి చర్చించుకుంటే.. ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రస్తావన లేకుండా ఆ చర్చ సంపూర్ణం కాదనే టాక్‌ ఉంది.

సీఎస్‌కు తెలియకుండా జీవోలు ఇచ్చేవారని ఆరోపణలు

సీఎం ముఖ్య కార్యదర్శిగానే కాకుండా.. జీఏడీ పొలిటికల్‌ ముఖ్యకార్యదర్శిగా కూడా రెండు కీలకమైన బాధ్యతలను తన చేతుల్లో పెట్టుకున్నారు ప్రవీణ్‌ ప్రకాష్‌. అయితే జీఏడీ పొలిటికల్‌ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ మార్పుల వెనక సీఎస్‌ కీలకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒకట్రోండు సందర్భాల్లో వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయట. సీఎస్‌ ఆమోదంతో ఇవ్వాల్సిన కొన్ని జీవోలు ఆయనకు తెలియకుండా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.

ఆర్థికశాఖలో విలీనం జీవోతో ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాల్లో కత్తెర పడిందా?

తాజాగా రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే రెండుకీలక శాఖలైన వాణిజ్య పన్నులు.. స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖలను ఆర్థికశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం సీఎస్‌ దృష్టిలో ఉన్నప్పటికీ.. అది ఇంకా ప్రతిపాదనల దశలో ఉందట. ఇంతలోనే ఆ రెండు విభాగాలను ఆర్థికశాఖలో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో వల్ల ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాల్లో కత్తెర పడిందని చెవులు కొరుక్కుంటున్నారు. కొంత కాలంగా ప్రవీణ్ ప్రకాష్‌ వ్యవహర శైలిపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ విలీన ప్రక్రియకు సంబంధించిన జీవో తెర మీదకు రావడంతో సీఎస్‌ ఒత్తిడి మేరకు ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాలకు కోత పడిందని అనుకుంటున్నారు.

అధికారాల కత్తెర వెనక ఎవరి ఒత్తిళ్లు లేవని పైకి ప్రచారం!

ఈ ప్రచారం వల్ల డ్యామేజ్‌ అవుతుందని అనుకున్నారో ఏమో.. ప్రవీణ్‌ ప్రకాష్‌ నుంచి జీఏడీ పొలిటికల్‌ బాధ్యతలు తప్పించాలనే ఆలోచన ఉందని చెప్పుకొస్తున్నాయి. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారట. పైగా కీలకమైన జీఏడీ పొలిటికల్‌ విభాగం బాధ్యతలను ఒకే అధికారి నిర్వహించడం కష్టమని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిస్తున్నారు. ఇకపై సీఎంఓలో ప్రవీణ్ ప్రకాష్‌ సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందట. కారణాలు ఎలా ఉన్నా..ఐఏఎస్‌ ప్రవీణ్ ప్రకాష్‌ విషయంలో విడుదలైన జీవో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-