హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఇద్దరు…

హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పై కసరత్తు తుది దశకు చేరిందా? రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి పేరు ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోందా? అభ్యర్థి ఎంపికపై సర్వే రిపోర్థులతో స్పష్టత వచ్చినట్లేనా? హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు ఎవరెవరు రేసులో హుజురాబాద్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం, స్థానికతపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు తుది దశకు చేరిందని చర్చ సాగుతోంది. ఇక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందని అనేక సర్వేలు చేసిందట ఆశావహుల పేర్లు పరిశీలిస్తూ స్థానిక నేతలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం తీసుకుందట టిఆర్ఎస్ అధిష్టానం

పోటీలో నిలబెట్టే అభ్యర్థి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట అందుకోసమే అనేక మంది పేర్లు పరిశీలించిన తర్వాత, స్థానిక నేతల వైపు మొగ్గు చూపుతున్నారట కేసీఆర్. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గ నేత కాబట్టి, ఆ సామాజిక వర్గం నుండి ఎవరినైనా పోటీలో ఉంచాలని టిఆర్ఎస్ అధిష్టానం భావించిందట కానీ ఆ సామాజిక వర్గంలో బలమైన నేత లేకపోవడంతో పార్టీలో సీనియర్‌ బోయినపల్లి వినోద్ కుమార్‌ , కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యుల పేర్లతోపాటు , ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయట. వీరితో పాటు ఇతర జిల్లాలకు చెందిన బీసీ నేతల పేర్లు కూడా పరిశీలించిందట టియ్యారెస్‌ అధిష్టానం

అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఇద్దరు మిగిలారనే టాక్‌ వినిపిస్తోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,ఎల్ రమణ పేర్లు తుది దశకు చేరాయట. ఈటెల రాజేందర్ పై బిసి నేత ని రంగంలోకి దింపాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. దానికోసమే హుజురాబాద్ కు చెందిన స్థానిక నేతలకు టిక్కెట్‌ ఇవ్వాలని కెసీఆర్‌ యోచిస్తున్నారని సమాచారం.

యాదవ సామాజిక వర్గానికి చెందిన టి ఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేరు టికెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం బలంగా ఉండటంతో జగిత్యాల జిల్లాకు చెందిన రాష్ట్ర నేత ఎల్ ఎల్ రమణ ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే దానిపై కూడా లెక్కలు వేస్తున్నారట. ఈటల రాజేందర్ బిసి సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు కాబట్టి టిఆర్ఎస్ నుండి కూడా బీసీ నేతనే బరిలో దించితే గెలవచ్చనే ఊహాగానాలతో టిఆర్ఎస్ అధిష్టానం కసరత్తు సాగిస్తుందట.

ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ క్యాడర్, మంత్రులు ఎమ్మెల్యే లు, రాష్ట్ర నాయకులు పర్యటనలు చేస్తున్నారు. ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో అభ్యర్థి ఎంపిక త్వరగా ఫైనల్ అయితే పక్కా ప్రణాళికతో ముందుకు సాగవచ్చని టిఆర్ఎస్ క్యాడర్ భావిస్తుందట. దీంతో మరో నాలుగైదు రోజుల్లో అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయనే టాక్‌ నడుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-