రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ ఇంట్లో మూడు పార్టీలు !

ఒకప్పుడు ఆయన రాజకీయంగా బలమైన నాయకుడు. వారసులు కూడా తండ్రిని అనుసరించారు. కాకపోతే ఒకే వేదికపై లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఉన్నాయి. దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? ఏదోఒక పార్టీ పవర్‌లో ఉండకపోతుందా అన్న లెక్కలున్నాయా?

టెక్నికల్‌గానే టీఆర్‌ఎస్‌లో ఉన్నా డీఎస్‌!

ధర్మపురి శ్రీనివాస్‌. తెలుగు రాష్ట్రాల వారికి DSగా సుపరిచితం. కాంగ్రెస్‌లో అంచలంచెలుగా ఎదిగిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో PCC చీఫ్‌గా పనిచేశారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ కండువా కొని.. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే టీఆర్‌ఎస్‌తో DSకు గ్యాప్‌ రావడానికి.. ఆపార్టీలో చేరినంత సేపు పట్టలేదు. శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించాలని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు తీర్మానం చేయడం అప్పట్లో కలకలం రేపింది. కానీ.. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం డీఎస్‌పై ఎలాంటి చర్యలు తీసుకో లేదు. టెక్నికల్‌గా డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో ఉన్నారంటే ఉన్నారు. కానీ..రాజకీయంగా చురుకైన పాత్ర పోషించడం లేదు.

read also : ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ విడుదల

రేవంత్‌ను కలిసి డీఎస్‌ కుమారుడు సంజయ్‌!

డీఎస్‌ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సమయంలోనే ఆయన కుమారుల్లో ఒకరైన సంజయ్‌.. నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. కొన్ని ఆరోపణల కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు సంజయ్‌. ఇటీవల పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టడంతో ఆయన మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. రేవంత్‌ను కలిసి తన మనసులోని మాటను చెప్పారు కూడా.

బీజేపీలో ఉన్న డీఎస్‌ ఇంకో కుమారుడు!

ఇక్కడే ఇంకో గమ్మత్తు ఉంది. డీఎస్‌ మరో కుమారుడు మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. దీంతో ఒకే ఇంట్లో మూడు పార్టీలకు చెందిన వారు ఉన్నట్టయ్యింది. టెక్నికల్‌గా డీఎస్‌ టీఆర్‌ఎస్‌, సంజయ్‌ కాంగ్రెస్‌.. ఇంకో కుమారుడు బీజేపీ. కుటుంబపరంగా కలిసి ఉన్నా.. రాజకీయంగా మాత్రం ఎవరిదారి వారు చూసుకున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత డీఎస్‌ ఏం చేస్తారో తెలియదు. వయసు రీత్యా యాక్టివ్‌గా ఉంటారో లేదో కానీ.. సీనియర్‌ నేతగా ఉన్న తండ్రిని ఇద్దరు కుమారులు అనుసరించకపోవడమే ఆసక్తిగా మారింది.

తండ్రి.. ఇద్దరు కుమారులు.. మూడు పార్టీలు!
సోదరులు ఒకరిపై ఒకరు పోటీ పడాల్సి వస్తే?

ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగాలంటే అధికార పార్టీలో ఉండాలి. లేదంటే పొలిటికల్‌ తెరపై మనుగడ కష్టం. ఇలా ముగ్గురు మూడు పార్టీలలో ఉండటం వల్ల.. ఏదో ఒక పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మిగతావారు సేఫ్‌ కావాలని చూస్తున్నారో లేక.. రాజకీయంగా వారి మనసులు కలవడం లేదో కానీ.. డీఎస్‌ ఫ్యామిలీ ముందు చూపుతో వెళ్తుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే చాలా గ్యాప్‌ తర్వాత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిష్తానని వస్తున్న సంజయ్‌కు కాంగ్రెస్‌లో ఎలాంటి రోల్‌ ఉంటుందన్నది చూడాలి. రేపటి రోజున వైరిపక్షాలుగా డీఎస్‌ కుమారులు ఒకరిపై ఒకరు పోటీపడాల్సి వస్తే ఏం చేస్తారో అన్న చర్చ కూడా వారి అనుయాయుల్లో మొదలైంది. రాజకీయాల్లో ఏదీ ముందుగా ఊహించలేం. రేపటి రోజున ఏదైనా జరగొచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-