రైస్ మిల్లర్ల తీరుపై స్పీకర్ తమ్మినేని హాట్ కామెంట్స్

రైస్ మిల్లర్ల తీరు పై స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల తీరు పై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని. ధాన్యం క్వింటాకు మేలు రకం 1960 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది.

పైసా తక్కువ ఇచ్చినా ధాన్యం తీసుకోకపోయినా లైసెన్స్‌ రద్దు చేస్తాం అని హెచ్చరించారు. మిల్లర్స్ తమాషాలు చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార లావాదేవీలు మినహా రైతుల కష్టనష్టాలు వారికి పట్టడంలేదన్నారు. ప్రభుత్వ ధరకు కొనకుండా తిరస్కరిస్తే ఇతర జిల్లాల రైస్ మిల్లర్లతో ధాన్యం కొనిపిస్తాం అని హెచ్చరించారు. దళారులను రైస్ మిల్లర్స్ ప్రోత్సహిస్తున్నారని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు.

Related Articles

Latest Articles