మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే వైద్యం తీసుకున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. మణిపాల్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ్మినేనికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. కాగా.. కరోనా బారిన పడి సీతారాం దంపతులు మే 12వ తేదీన కరోనా నుంచి కోలుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-