స‌రికొత్త ప‌థ‌కం: త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేస్తే నెల‌కు రూ.21 వేలు…

మ‌న‌దేశంలో ఉమ్మ‌డి కుటుంబాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. త‌ల్లీదండ్రులు, కొడుకు, కోడ‌లు, వారి పిల్ల‌లు ఇలా ఉమ్మ‌డి కుటుంబానికి ప్రాధాన్య‌త ఇస్తూ ఉంటారు. క‌రోనా కార‌ణంగా చాలామంది న‌గ‌రాల నుంచి తిరిగి గ్రామాల‌కు వ‌ల‌స వెళ్లిపోయారు. ఉద్యోగాలు కోల్పోవ‌డంతో గ్రామాల్లో త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. మ‌న‌దేశంలో 30 ఏళ్లు దాటిన ల‌క్ష‌లాది మంది యువ‌త ఇప్ప‌టికీ తల్లిదండ్రుల సంపాద‌న‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, స్పెయిన్‌లోని ప్ర‌భుత్వం ఓ కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. త‌ల్లి దండ్రుల‌ను వ‌దిలేసి విడిగా జీవించే యువ‌త‌కు ప్రోత్సాహం కింద నెల‌కు 250 యూరోలు అంద‌జేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత కాలంగా దేశంలో త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డి జీవించే పిల్ల‌ల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో స్పెయిన్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిరుద్యోగులు, వార్షిక ఆదాయం 23 వేల యూరోలు లోపు ఉన్నవారికి నెల‌కు 250 యూరోలు అంద‌జేస్తామ‌ని, ఈ డ‌బ్బును అద్దెకోస‌మే వినియోగించాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవ‌త్సారాలలోపు వ‌య‌సున్న వ్యక్తులు దీనికి అర్హుల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Read: యూపీ రాజ‌కీయం: మ‌ళ్లీ చీపురు ప‌ట్టిన ప్రియాంక గాంధీ…

-Advertisement-స‌రికొత్త ప‌థ‌కం:  త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేస్తే నెల‌కు రూ.21 వేలు...

Related Articles

Latest Articles