కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి

సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.

Read Also: బిగ్‌ బ్రేకింగ్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్

ముఖ్యంగా కేప్‌టౌన్ టెస్టులోనూ భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. బుమ్రా, షమీ, శార్దూల్, ఉమేష్ యాదవ్, అశ్విన్… ఇలా దిగ్గజ బౌలర్లందరూ కలిసి మూడంటే మూడే వికెట్లు తీయగలిగారు. కె.పీటర్సన్ మరోసారి అద్భుత్ ఫామ్‌ను కనపరిచాడు. పీటర్సన్ (82), డస్సెన్ (41 నాటౌట్), బవుమా (32 నాటౌట్) కలిసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడినా అద్భుతంగా పుంజుకుని జోహన్నెస్ బర్గ్, కేప్‌ టౌన్‌ టెస్టులలో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించి టెస్టు సిరీస్‌ను సాధించింది.

స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్-223 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్-198 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌-210 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్-212/3

Related Articles

Latest Articles