కేప్‌టౌన్ టెస్ట్: టీమిండియాకు స్వల్ప ఆధిక్యం

కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు.

Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్‌లకు చోటు

భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు లభించాయి. షమీ 2 వికెట్లు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీసి బుమ్రాకు తమ వంతు సహకారం అందించారు. బుమ్రా తన కెరీర్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది ఏడోసారి. అటు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేస్తే సఫారీ జట్టు ముందు కష్టమైన టార్గెట్ నిలుస్తుంది. తద్వారా ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకునే సువర్ణావకాశం టీమిండియాకు లభిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి భారత్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

Related Articles

Latest Articles