చివరి టెస్ట్ పై దాదా కీలక వ్యాఖ్యలు…

భారత్-ఇంగ్లాండ్ జాత్మ మంధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను మళ్ళీ నిర్వహిస్తారా… లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. దాదా మాట్లాడుతూ… ఈ 5 టెస్టుల సిరీస్ పూర్తిగా జరగాలి. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు చివరి మ్యాచ్ లో గెలిచిన… డ్రా చేసుకున్న ఈ సిరీస్ టీం ఇండియా సొంతం అవుతుంది. అలా జరిగితే 2007 తర్వాత మళ్ళీ అక్కడ భారత్ గెలిచిన మొదటి సిరీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆగిపోయిన టెస్ట్ ఎప్పుడు జరిగిన ఈ సిరీస్ లో భాగంగానే జాగాలి తప్ప.. ఒక్క టెస్ట్ మ్యాచ్ ల మాత్రం జరగకూడదు అని తెలిపారు. ఇక చివరి టెస్ట్ వాయిదా పడటంతో ఇప్పటికే భారత ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-