సౌరవ్ గంగూలీ బయోపిక్ లో స్టార్ హీరో ?

గత కొంతకాలంగా క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది చిత్రపరిశ్రమ. ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై ప్రదర్శించారు. తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బిబిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై త్వరలో బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నట్టు మాజీ టీమిండియా కెప్టెన్ వెల్లడించారు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదా జీవిత కథలో నటించడానికి ఓ స్టార్ హీరోను ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ దాదా బయోపిక్ లో, ఆయన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కానీ ఆ జాబితాలో మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లు కూడా ఉన్నాయట.

Read Also : “ఏజెంట్”లో నాగ్… దర్శకుడి షాకింగ్ రియాక్షన్

క్రికెట్ ప్రపంచంలో గంగూలీ అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకరు. ఆయన జీవిత కథలోనూ సినిమా తీయడానికి కావాల్సినంత కథ, కథనం, ఎమోషన్స్ ఉన్నాయి. సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి నుండి భారత క్రికెట్ జట్టులో చేరడం, కెప్టెన్ కావడం, చివరికి అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు వహించడం వరకు బయోపిక్ లో చూపించనున్నారు. ఈ బయోపిక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా సంజయ్ దత్ బయోపిక్ “సంజు”లో రణబీర్ కపూర్ అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-