చంద్రబాబుపై సోనూసూద్ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వారియర్స్ కు సంబంధించి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వర్చువల్ మీటింగ్ కండెక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో పాల్గొన్న సినీ నటుడు సోనూ సూద్ చంద్రబాబును ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ “హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను. కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషం. ఆంధ్రా, తెలంగాణలు నాకు ఇల్లు లాంటివి. నా భార్య ఆంధ్రప్రదేశ్ కు చెందినది కావటం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. కోవిడ్ సమయంలో నాకు తోచిన సాయం అందివ్వడం ఎంతో తృప్తినిస్తోంది” అని అన్నారు. ఇంకా సోనూసూద్ మాట్లాడుతూ “కరోనా మొదటి దశ ప్రభావం రెండో దశలో ప్రజలపై పడింది. ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అర్థరాత్రి 2 గంటల సమయంలోనూ సహాయం అర్థిస్తూ నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి. ఆపదలో ఉన్న వారికి సమయంతో సంబంధం లేకుండా సేవ చేయటం నా బాధ్యతగా భావించాను. ఎవరికి వారు తాము చేయాలనుకునే సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. సాయం కోరిన వారి పట్ల ఇతరత్రా ఆలోచన లేకుండా సేవ చేయటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండి. సేవ చేసేందుకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నా. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ తో పాటు మరో చోట 4 ప్లాంట్లు నెలకొల్పుతున్నాం. ఇతర రాష్ట్రాలు తమ వద్ద ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి” అని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు కూడా కోవిడ్ కాలంలో సోనూసూద్ చేసిన సేవలను ప్రశంసించారు. కరోనా రోగులతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులే భయపడుతుండగా… అవసరమైన వారికి, ఫ్రంట్‌లైన్ యోధులకు సహాయం అందించడానికి ముందుకొచ్చిన సోనూసూద్ ను అభినందించారు చంద్రబాబు. సోనూసూద్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నిజమైన హీరో అని, ఆయన తన ఔదార్యంతో ఇలాగె ముందుకు సాగాలని కోరారు. అలాగే ఈ రియల్ హీరో చాలా మందికి ప్రేరణగా నిలుస్తారని అన్నారు. ఇక ఫ్రంట్‌లైన్ యోధులు చేస్తున్న సేవలకు మాజీ సిఎం సెల్యూట్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-