సోనూసూద్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడా ?

సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కరోనా మహమ్మారి ఏశంలో విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆయన ప్రజలకు తన సేవను కొనసాగిస్తూ రియల్ హీరోగా ప్రజలచేత కీర్తించబడుతున్నాడు. పేదలైతే ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట. తెలుగు చిత్రం “అల్లుడు అదర్స్”లో నటించినందుకు సోను రూ.2.5 కోట్లు వసూలు చేశారు. అయితే తాజాగా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం సోనూసూద్ ను మేకర్స్ సంప్రదించారట. అయితే సోనూసూద్ 7 కోట్ల రూపాయలు పారితోషికంగా అడిగాడట. అతను కోరిన మొత్తాన్ని మేకర్స్ చెల్లించలేనందున వేరే వాళ్ళను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు విన్న ప్రజలు కఠినమైన సమయాల్లో ఆయన చేసిన గొప్ప పనులను పరిగణనలోకి తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచడంలో ఏమాత్రం తప్పులేదు అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-