గణనీయంగా పెరుగుతున్న సోనూసూద్ ఫాలోవర్స్!

ప్రముఖ నటుడు… అంతకు మించిన మానవతా మూర్తి సోనూసూద్ ను అభిమానించే వారి, అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. స్నేహితుల విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలా కరోనా కష్టకాలంలో తనకు తెలిసి వారికి, తెలియని వారికి కూడా స్నేహహస్తాన్ని అందించి మిత్రుడిగా మారిపోయాడు సోనూసూద్. అతను, అతని బృందం రాత్రింబవళ్ళు కష్టపడి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చారు. అయితే అంతటితో తన మిషన్ ను సోనూసూద్ ఆపేయలేదు. నిజానికి ఆ తర్వాతే అతను తన పనిని మరింత విస్తారంగా, మరింత లోతుగా, మరింత ప్రభావవంతంగా చేయడం మొదలు పెట్టాడు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందించడంతో సోనూసూద్ చూపిన చొరవ అద్భుతం. అందుకే మొన్నటి వరకూ నటుడిగా అతన్ని కేవలం అభిమానించిన వారు ఇవాళ అతనిలోని సేవా గుణం చూసి ఆరాధించడం మొదలు పెట్టారు. అంతేకాదు… సోనూసూద్ చెప్పే మంచి మాటలు వినడం కోసం, అతను చేస్తున్న సేవా కార్యక్రమాలకు దన్నుగా నిలవడం కోసం తమ వంతు కర్తవ్యంగా కొందరు సోషల్ మీడియాలో అతన్ని ఫాలో కావడం మొదలు పెట్టారు. అలా ఆగస్ట్ 24వ తేదీకి సోనూసూద్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 9 మిలియన్లకు చేరింది. అంటే అక్షరాల తొంభై లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్నారన్న మాట. ఈ సంఖ్య కోటికి చేరడానికి ఇంకెంతో సమయం పట్టదు!! లగే రహో సోనూసూద్‌!!

Related Articles

Latest Articles