చేరుకున్న ఆక్సిజన్ ప్లాంటు.. సోనూసూద్‌ తెలుగులో ట్వీట్

కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉండేనో అందరికి తెలిసిందే. సమయానికి ఆక్సిజన్ అందాక చాలా మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. అయితే కరోనామహమ్మారీ విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్.. ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నా ఆయన.. ఆక్సిజన్ కొరత వున్నా రాష్ట్రాల్లో ఏకంగా ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటు చేరుకుందని సోను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ప్రాణ వాయువు త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంస్టాల్ చెయ్యబోతున్నాను’ అంటూ సోనూ తెలుగులో ట్వీట్ చేస్తూ భాషాభిమానాన్ని చాటుకున్నారు.

-Advertisement-చేరుకున్న ఆక్సిజన్ ప్లాంటు.. సోనూసూద్‌ తెలుగులో ట్వీట్

Related Articles

Latest Articles