శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి అండగా సోనూసూద్

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా పరిస్థితి సీరియస్ అవ్వడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ గత నాలుగు రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ రోజురోజుకూ శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. ఆయన వైద్యానికి రోజుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది.

Read Also : నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన

“ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కోవిడ్ 19 బారిన పడ్డారు. ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉంది. ఖరీదైన వైద్యం వల్ల ఆ కుటుంబం బిల్లులు కట్టలేకపోతోంది. దయచేసి సహాయం చేయండి. అజయ్ కృష్ణ (కొడుకు) 9840323415ను సంప్రదించండి” అంటూ వంశీ కాక అనే పిఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ విషయం గమనించిన సోనూసూద్ తాను ఆ కుటుంబంతో టచ్ లో ఉన్నాను అని, శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు సోనూసూద్. అద్భుతమైన కొరియోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం.

మరో విషాదకర విషయం ఏమిటంటే ఒక్క ఆయన కుటుంబంలోనే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడడం. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి, అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ ముగ్గురి బాగోగులు చూసుకుంటున్నారు.

Related Articles

Latest Articles