సోనూసూద్ డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్

రియ‌ల్ హీరో సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో నిరుపేద‌ల‌కు అండ‌గా నిలువగా.. అప్పటి నుంచి ఎవరి ఏ కష్టమొచ్చిన తన వంతు సాయం చేస్తున్నాడు. ఇదిలావుంటే, సోనూసూద్ ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటాడో అందరికి తెలిసిందే.. అయితే తాజాగా అయిన చేసిన ఫిట్నెస్ స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూసూద్ తన రెండు చేతులు నేలపై పెట్టి కాళ్ళు గాల్లోకి లేపాడు.. ఆపై చేతులు కూడా నేలపై నుంచి తీసేయడంతో ఒక్కసారిగా ఆ మాయాజాలానికి అంత షాక్ అయ్యారు. అయితే ఇదంతా వీడియో ట్రిక్ అని తెలిసిన.. సోనూ నిపుణుల మధ్యే చేయండని రాసుకురావడంతో నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-