అభిమానులకు సోనూసూద్​ విజ్ఞప్తి

నటుడు సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆంధ్రప్ర‌దేశ్‌లోని క‌ర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొలి ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సోనూసూద్ మాన‌వ‌తా హృద‌యానికి అంద‌రూ ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు. అది కాస్త వైరల్ గా మరి సోనూసూద్ దాకా చేరింది. ఈ నేప‌థ్యంలో సోను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీ అభిమానానికి కృతజ్ఞుడను. పాల‌ను వృధా చేయొద్ద‌ని అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. పాలు అవ‌స‌ర‌మైన వారి కోసం వాటిని అంద‌జేయాల‌ని సోనూసూద్ విజ్ఞ‌ప్తి చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-