సోనూసూద్ మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడంటే…

కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారికి తనవంతుగా ఎంతో సాయం చేస్తున్నారు సోనూసూద్. ఇప్పటికే యు.ఎస్., ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ సిలెండర్స్ ను, వాటి తయారీ యంత్రాలను తీసుకొచ్చారు సోనూసూద్. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసే పనిలోనూ ఆయన బృందం నిమగ్నమై ఉంది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ తొలి ఆక్సిజన్ ఫ్లాంట్స్ ను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ బృందం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో ఉంది. ఆ తర్వాత నెల్లూరులో ప్లాంట్ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీని కోసమై ఇప్పటికే మున్సిపల్ కమీషనర్, కలెక్టర్ల మరియు ఇతర సంబంధిత అధికారుల నుండి అనుమతులను పొందారట. సోనూసూద్ ఏర్పాటు చేసే ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో 150 నుండి 200 మంది కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించవచ్చని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడం ఇవాళ్టి పరిస్థితుల్లో చాలా అవసరమని, ఆంధ్రప్రదేశ్ తర్వాత జూన్, జూలై మాసాలలో ఇతర రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు.

-Advertisement-సోనూసూద్ మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడంటే…

Related Articles

Latest Articles