పంజాబ్‌ ఐకాన్‌గా ఉండను: సోనూసూద్‌

సినీ నటుడు, హెల్పింగ్‌ స్టార్‌ సోనూ సూద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎంతో మంది ఈ హెల్పింగ్‌ స్టార్‌కు ఆరాధ్యులుగా మారారు. కొన్ని చోట్లయితే ఏకంగా గుడులు సైతం కట్టారు. తాజాగా సోనూసూద్‌ పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌ హోదా నుంచి స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.

Read Also: గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సోము వీర్రాజు భేటీ

అన్ని మంచి విషయాల్లాగే, ఈ ప్రయాణం కూడా ముగిసింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యురాలు (సోదరి) పోటీ చేస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తాను ఎన్నికల సంఘం కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వారి భవిష్యత్‌ ప్రయత్నాలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. కాగా నవంబర్‌ 2020లో భారత ఎన్నికల సంఘం సోనూసూద్‌ను పంజాబ్‌ ఐకాన్‌గా ప్రకటించింది.


Related Articles

Latest Articles