తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక‌పై కీల‌క భేటీ…ఏ క్ష‌ణ‌మైనా…

తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది.   నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీని నియ‌మించాల్సి ఉన్నా, ఉప ఎన్నిక‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని వాయిదా వేశారు.  కాగా, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నియామ‌కంపై సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌రుగుతున్న‌ది.  ఈ స‌మావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజ‌ర‌య్యారు.  ఏ క్ష‌ణ‌మైనా టీపీసీసీ అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ది.  టీపీసీసీ రేస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.  ఎవ‌ర్ని అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టింబోతున్నారు అన్న‌ది ఉత్కంఠంగా మారింది.  తెలంగాణ పీసీసీరేసులో రేవంత్ రెడ్డితో పాటుగా కోమ‌టిరెడ్డి కూడా ఉన్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-