‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్!

‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన సోనియా అగర్వాల్ ‘7/జి బృందావన్ కాలనీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ తో పెళ్ళి, ఆ పైన విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది సోనియా అగర్వాల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సినిమాతో సంగీత దర్శకుడు నవనీత్ చారి తొలిసారి దర్శకుడిగా మారారు. శ్రీ శైలం పోలెమోని నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, పోసర్ట్ ఆవిష్కరణ ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ, ”మంచి టెక్నీషియన్స్‌ టీంతో పనిచేశాం. సోనియా అగర్వాల్‌ మా స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్‌ హీరోయిన్‌ ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్‌ చేసి షూటింగ్‌ సమయానికి అన్నీ అరేంజ్‌ చేశారు. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ చిత్రంలో సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles