‘నెలతప్పిన’ గాసిప్స్ కి చెక్! పీరియడ్ మిస్ కాలేదన్న మిసెస్ సోనమ్!

బాలీవుడ్ అంటే సినిమాలు, గ్లామర్, క్రియేటివిటి మాత్రమే కాదు… అన్నిటికంటే ముఖ్యంగా… గాసిప్స్ అండ్ పబ్లిసిటీ! బీ-టౌన్ లో గాసిప్స్ తో ఇబ్బంది పడని గార్జియస్ బ్యూటీస్ ఎవరూ ఉండరు. అందరికీ ఎప్పుడో అప్పుడు పుకార్ల సెగ తగులుతూనే ఉంటుంది. కానీ, ఇంతకు ముందు బాలీవుడ్ భామలు పుకార్లంటే వణికిపోయేవారు. ఇప్పుడు రివర్స్ గేర్ లో వస్తున్నారు. తప్పుడు ప్రచారాల్ని కూడా తమ పబ్లిసిటీ కోసం తెలివిగా వాడుకుంటున్నారు. తాజాగా సోనమ్ కపూర్ అహుజా అదే పని చేసింది… మిసెస్ సోనమ్ అహుజా ప్రెగ్నెంట్ అంటూ ఉన్నట్టుండీ గాసిప్స్ మొదలయ్యాయి. వాటికి ఆధారం ఏంటో ఎవరికీ తెలియాదు.

ఇక సోనమ్ కూడా అవుననీ, కాదనీ చెప్పకుండా కొంత సమయం గాసిప్స్ ను ఎంటర్టైన్ చేసింది. అయితే, ‘ఇక చాలు’ అనుకున్న బోల్డ్ బ్యూపటీ వేడి నీళ్ల బాటిల్ తో ప్రత్యక్షమైంది! ఎక్కడా? ఎందుకు? అంటారా? ఇన్ స్టాగ్రామ్ లో! తన ఇన్ స్టా అకౌంట్లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది సోనమ్. “వేడి నీళ్ల బాటిల్, జింజర్ టీ… నా పీరియడ్ లో మొదటి రోజు కోసం!” అని క్యాప్షన్ ఇచ్చింది! దీనర్థం ఏంటి? మరోసారి ఆన్ లైన్ లో చర్చ మొదలైంది! “సోనమ్ నెల తప్పిందని వచ్చిన పుకార్లన్నీ ఒట్టివే!” తీర్మానించేశారు నెటిజన్స్! నెలతప్పలేదు కాబట్టే హాట్ వాటర్ బాటిల్, జింజర్ టీ అవసరమయ్యాయి! బాలీవుడ్ సెలబ్రిటీలు అన్నాక గాసిప్స్ రావటం షరా మామూలే. వాట్ని అవుననో, కాదనో ఠక్కున తేల్చేస్తే ‘ఫన్’ ఏముంటుంది? అందుకే, కొంత సమయం గడిచేదాకా ఆగి… సోనమ్ కపూర్ లాగా వెరైటీగా యాన్సర్స్ ఇస్తుంటారు… ఈ తరం బీ-టౌన్ బ్యూటీస్! మిసెస్ అహుజా “నేను ప్రెగ్నెంట్ కాదు” అని సింపుల్ గా చెబితే పోయేదానికి… పీరియడ్ మిస్ కాలేదని హింట్ ఇవ్వటం… ‘వాట్ ఏ స్ట్రాటజీ’ ఇంకేమవుతుంది?

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-