వేశ్యగా సోనాక్షి… ‘ముజ్రా’లతో మురిపించనున్న ముద్దుగుమ్మ!

బాలీవుడ్ షో-మ్యాన్ సంజయ్ లీలా బన్సాలీ మరో రొమాంటిక్, మ్యూజికల్, లవ్ సాగాకి రెడీ అవుతున్నాడు. ‘హీరా మండి’ అనే చిత్రం రూపొందించబోతున్నాడు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘పాకీజా’ నుంచీ ఈ సినిమా విషయంలో ప్రేరణ పొందాడట బన్సాలీ.

హిందీ తెరపై కథానాయికలు నర్తకీమణులుగా, వేశ్యలుగా కనిపించబటం కొత్తేం కాదు. ‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ లో అప్పటి తరం వారు ఆడిపాడారు. ‘దేవదాస్’లో చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ కూడా ‘ముజ్రా’తో మోహంలో ముంచేసింది. ఉత్తరాదిలో సంపన్నులైన విటుల ముందు వేశ్యలు చేసే శాస్త్రీయ నృత్యాన్ని ముజ్రాలు అంటారు! ఐశ్వర్య రాయ్ కూడా ‘ఉమ్రావ్ జాన్’ రీమేక్ లో అందమైన ముజ్రాలతో మంత్ర ముగ్దుల్ని చేసింది…

Read Also: సోనియాతో కెప్టెన్ భేటీ.. సంక్షోభం ముగిసినట్టేనా..?

‘హీరా మండి’ సినిమాలో సంజయ్ బన్సాలీ కూడా ముజ్రా సంస్కృతిని చూపబోతున్నాడట. ఇప్పటికే హ్యుమా ఖురేషి ఓ నర్తకిగా ఎంపికైంది. మరో ముజ్రా డ్యాన్సర్ గా సోనాక్షి సిన్హాను ఎంచుకున్నాడట సంజయ్. గతంలో బన్సాలీ ప్రొడక్షన్స్ లో సోనాక్షి ‘రౌడీ రాథోర్’ సినిమా చేసింది. అయితే, ఆయన డైరెక్షన్ లో సినిమా చేయటం ఇదే మొదటిసారి. సోనాక్షి కంటే ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ‘హీరా మండి’ విషయంలో ఆసక్తిగా ఉన్నాడని సమాచారం! బన్సాలీ డైరెక్షన్లో సోనాక్షి ఒక్క సినిమా అన్నా చేయాలన్నది ఆయన కోరికట!

Read Also: ఎలక్షన్స్ ఎప్పుడని అడుగుతున్న ప్రకాశ్ రాజ్!

‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ లాంటి క్లాసిక్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో ‘హీరా మండి’ రూపొందిస్తున్నప్పటికీ సంజయ్ లీలా బన్సాలీ మల్టీ స్టారర్ లో పాటలు, నృత్యాలు ప్రత్యేకంగా ఉంటాయట! హ్యుమా, సోనాక్షి లాంటి బాలీవుడ్ బ్యూటీస్ చేసే ముజ్రాలతో పాటూ మైమరిపించే సంగీతం ‘హీరా మండి’ని ఓ మథుర జ్ఞాపకం మారుస్తాయని ముంబైలో చెప్పుకుంటున్నారు. చూడాలి మరి, సోనాక్షితో పాటూ ఇంకా ఎవరెవరు బన్సాలీ బిగ్ మూవీలో భాగం అవుతారో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-