అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనే : సోము వీర్రాజు

అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనేనని… రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ చెబుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సోము వీర్రాజు మాట్లాడుతూ… అమరావతి రైతుల పోరాటానికి బీజేపీ మద్ధతిస్తుందన్నారు.

ఈ నెల 21న రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని…తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతుల పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. మచిలీపట్నం నుంచి నెల్లూరు వరకు దళిత‌మోర్చా నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సోము వీర్రాజు.

Related Articles

Latest Articles