చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు.. అవసరమైనప్పుడే మాత్రమే..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు అని ఎద్దేవా చేసిన ఆయన.. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్దుడు అని వ్యాఖ్యానించారు.. గతంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా లవ్ చేశారని.. చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అని హాట్‌ కామెంట్లు చేశారు. ఇక, జనసేన పార్టీ మా మిత్రపక్షం అని మరోసారి స్పష్టం చేశారు సోము వీర్రాజు..

Read Also: ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్.. డేంజరే..!

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్‌లో ఎదురైన ఘటనపై స్పందించిన ఆయన.. ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లింప చేసేలా పంజాబ్‌లో పరిస్థితులు సృష్టించారిన మండిపడ్డారు.. ప్రధాని విషయంలో జరిగిన వ్యవహారంపై నిరసనలు తెలియచేస్తాం… ఈ విషయంలో ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కూడా కలవున్నట్టు వెల్లడించారు సోము వీర్రాజు. కాగా, ఏపీలో దూకుడు పెంచింది బీజేపీ.. వైసీపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. ఇదే, సమయంలో.. చంద్రబాబే ఓ ప్లాన్‌ ప్రకారం.. ఈ సభలు పెట్టిస్తున్నారని.. బీజేపీ సభల వెనుక టీడీపీ ఉందంటూ అధికార వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు, కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు బహిరంగ సభలో ఓ ప్రశ్న ఎదురైంది.. వచ్చే ఎన్నికల్లో.. మీరు జనసేనతో కలిసి పనిచేస్తారా? అని ఓ యువకుడు ప్రశ్నించాడు.. దీనికి బదులిచ్చిన బాబు.. అదే తమ్ముడు నీవు ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నావే అనుకో.. అది సరిపోదు.. రెండు వైపుల నుంచి కూడా లవ్‌ ఉండాలంటూ వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles