మైండ్‌ గేమ్‌ రాజకీయాలకు చెక్‌ పెడతాం-సోమువీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అప్పుడే పొత్తుల గురించి చర్చ సాగుతోంది.. అయితే, అదంతా కొందరు ఆడుతోన్న మైండ్‌ గేమ్‌.. దానికి త్వరలోనే చెక్‌ పెడతాం అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివేకానందుని స్ఫూర్తిని నింపుకున్న యువతదే అభివృద్ధిలో కీలక పాత్ర అన్నారు.. యువతను ప్రభావితం చేసేలా కొందరు మైండ్‌ గేమ్స్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని.. ఏపీలో జరిగే మైండ్‌ గేమ్‌ రాజకీయాలకు చెక్‌ పెడతాం అన్నారు. మైండ్‌ గేమ్‌తో కొన్ని పార్టీలు ప్రభావితం చేస్తున్నాయని అన్నారు సోమువీర్రాజు.. పొత్తుల విషయంలో కావచ్చు.. అభివృద్ధి విషయంలో కావచ్చు.. కొందరు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని.. అందరికీ త్వరలోనే చెక్‌ పెడతామని ప్రకటించారు. ఇక, 2014 తర్వాత ఏపీని అభివృద్ధి చేస్తోంది బీజేపీనే అన్నారు సోము వీర్రాజు.. ఏపీ భవిష్యత్‌ అభివృద్ధిలో బీజేపీ-జనసేన పార్టీలు భాగస్వాములు అవుతాయన్నారు.

Related Articles

Latest Articles