గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సోము వీర్రాజు భేటీ

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో భేటీ అంశాలను వీర్రాజు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. దేశ బోర్డరుకు పది కిలోమీటర్లు, పాకిస్తాన్‌కు దగ్గరలో ఉన్న ప్రాంతమని అలాంటి చోట ప్రధానికి రక్షణ కల్పించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందన్నారు.

ప్రధాని లాంటి పెద్దలకు బ్రిడ్జిలు వచ్చినప్పుడు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలి కానీ పంజాబ్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. సోనియా గాంధీ దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడుతున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్న సంగతిని మర్చిపోయారన్నారు. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద మౌనదీక్ష చేపడుతున్నామని, 13వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సోము వీర్రాజు తెలిపారు.

Related Articles

Latest Articles