రైతులపక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం మెడలు వంచుతాం : సోమిరెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పై నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకోల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఇతర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులపక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.

రైతులకోసం కేంద్రప్రభుత్వ సాయంతో అమలుచేసే పథకాలకు జగన్ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. సినిమా టిక్కెట్లు ధరలు తగ్గించి, పురుగుల మందు రేట్లు పెంచి జగన్ రైతులకు 70ఎంఎం సినిమా చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటుంటే మన రాష్ట్రంలో రైతులకు చుక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు.

Related Articles

Latest Articles