కంగనాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: కాంగ్రెస్‌

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కుతున్న బాలీవుడ్‌ నటి కంగనా పై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందకు మహారాష్ర్ట కాంగ్రెస్‌ సిద్ధమవు తుంది. ఇప్పటికే ఈ అమ్మడు 1947లో కాదు 2014లో స్వాతం త్ర్యం వచ్చిందని కామెంట్స్‌ చేసింది. దీనిపై మాములుగా జరగలేదు రచ్చ. కొందరైతే తనకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తిరిగి ఇచ్చివే యాలని డిమాండ్‌ మొదలైంది. సోషల్‌ మీడియాలో కంగనాను నెటి జన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు. అయినా ఈ అమ్మడు అవి పట్టిం చుకున్న దాఖలాలే లేవు. కానీ ఈ సారిమాత్రం కంగనాపై మహా రాష్ర్ట కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఫైర్‌ అవుతుంది. ఏకంగా ఆమెను కోర్టుకు ఇడ్చాడానికి కూడా సిద్ధమేనంటున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. తాజాగా మరోసారి కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో గాంధీజీ కి సంబంధించిన ఓ క్లిపింగ్‌ను పోస్టు చేసింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారు. అనే న్యూస్‌ క్లిపింగ్‌ను పోస్ట్‌ చేసి తాజా వివాదానికి కారణమైంది కంగ నా దీంతో మహారాష్ర్ట కాంగ్రెస్‌ పార్టీ మేం న్యాయపరంగా ఈ విష యాన్ని తెల్చుకుంటామని అవసరమైతే అత్యన్నత న్యాయ వ్యవస్థ వరకు వెళ్లి పోరాటం చేస్తామని వారు అన్నారు.

Related Articles

Latest Articles