కరోనాతో దర్శకుడు సుబ్బు తల్లి మృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులు కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కారణంగా తమ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమ పలువురు నటీనటులతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలను సైతం కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ వర్ధమాన దర్శకుడు సుబ్బు తల్లి కరోనాతో కన్నుమూశారు. సుబ్బు తల్లి మంగమ్మకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఆదివారం రోజు ఆమె హెల్త్ క్రిటికల్ గా మారడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో సమయానికి ఐసీయూ బెడ్ దొరకకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారట. దర్శకుడు సుబ్బు తన తల్లిని బ్రతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు సుబ్బు కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక దర్శకుడు సుబ్బు ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సుబ్బు తల్లి కోసం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-