కూకట్‌పల్లిలో రోడ్డుప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 1 సమీపంలో గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ బైక్‌ను ఢీకొన్న తర్వాత 20 మీటర్ల పాటు మృతదేహాన్ని టిప్పర్ ఈడ్చుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read Also: పాలడుగు గ్యాంగ్ రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. మృతుడు జగన్మోహన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles