బాబోయ్ ఈ వీడియో చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం…పర్వతంపై నుంచి ప‌డినా…

మ‌నం ప‌ది అడుగుల ఎత్తు నుంచి కింద‌ప‌డితే కాలో చేయో ఇరిగిపోతుంది.  అలాంటిది ఓ ఎత్తైన ప‌ర్వ‌తం నుంచి కింద‌పడినా దానికి ఏమీ కాలేదు.  పైగా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కునిలా నోటికి చిక్కిన వేట‌ను వ‌ద‌ల‌కుండా ప‌ట్టుకుంది.  మామూలుగా చిరుత‌ల‌కు ఆహ‌రం దొరికితే అస‌లు వ‌ద‌ల‌వు.  ఇక మంచు కొండ‌ల్లో వాటికి వేట దొర‌క‌డ‌మే చాలా క‌ష్టం.  అలాంటిది దొరికితే వ‌దులుతాయా చెప్పండి.  మంచు చిరుత‌కు ఓ జింక క‌నిపించింది.  వేటాడేందుకు చిరుత దూక‌గా అది తప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది.  కానీ, చిరుత వ‌ద‌ల‌కుండా వెంట‌ప‌డి ప‌ట్టుకుంది.  ఆ స‌మ‌యంలో ప‌ట్టుతప్పి జింక‌, దానితోపాటు చిరుత ఎత్తైన ప‌ర్వ‌తం మీద నుంచి కింద‌ప‌డ్డాయి.  అంత ఎత్తునుంచి కింద‌ప‌డినా జింక‌ను వ‌ద‌ల‌కుండా అలానే ప‌ట్టుకుంది.  వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ బాబోయ్ అనేస్తున్నారు. చిరుత ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.  దీనికి సంబందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

Read: విచిత్రం: ఒకే గ్రామంలో రెండు భాష‌లు…

Related Articles

Latest Articles

-Advertisement-