స్నీక్ పీక్‌ : “మాస్ట్రో” వరల్డ్ లోకి వెళ్దామా ?

నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీని వాయిదా వేసి సెప్టెంబర్ 17న ఈ మూవీని నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబోతున్నారు. తాజాగా ఈ రోజు సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.

Read Also : ఆదిత్య మ్యూజిక్ కు “భీమ్లా నాయక్” రైట్స్

కొద్దిసేపటి క్రితం మేకర్స్ ‘మాస్ట్రో స్నీక్ పీక్’ పేరుతో ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అంధుడిగా నటించిన నితిన్ పియానో ​​వాయిస్తున్నాడు. ఆ పియానో పై సంగీత దిగ్గజం ‘మాస్ట్రో; ఇళయరాజా ఫోటో కన్పించడం విశేషం. హీరో పియానో పై మంచి మ్యూజిక్ వాయిస్తుండగా కాసేపటికే అందులో ఒక కీ పని చేయకుండా పోతుంది. నితిన్ ఇది మళ్ళీ రిపేర్ చేయించాలా ? అంటూ అవసహనం వ్యక్తం చేయడం కన్పిస్తుంది. ఆ తరువాత హీరో తన వాచ్ లో నుంచి ఏదో తీస్తుండగా… వీడియోను ఎండ్ చేశారు. మొత్తానికి చిన్న వీడియోతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

-Advertisement-స్నీక్ పీక్‌ : "మాస్ట్రో" వరల్డ్ లోకి వెళ్దామా ?

Related Articles

Latest Articles