హమీదా సైతం ఆ జాబితాలో చేరిపోయింది! నెక్ట్స్ ఎవరో!!

బిగ్ బాస్ సీజన్ 5లో స్మోకింగ్ పర్శన్ జాబితాలో ఇప్పటికి ముగ్గురు చేరారు. లోబో, సరయు రెండో రోజు స్మోకింగ్ జోన్ లో గుప్పుగుప్పున దమ్ముకొట్టే సీన్స్ ను ప్రసారం చేశారు. అయితే… నిజానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే లోబో, సరయుతో కలిసి హమీదా సైతం రింగులు రింగులుగా సిగరెట్ పొగను వదిలింది. చిత్రం ఏమంటే హమీదా స్టైల్ గా దమ్ము కొట్టిన సీన్స్ ను ఎడిట్ చేశారు. లేలేత నాజూకు అందాలతో ఉన్న హమిదాలో ఈ కోణాన్ని డైరెక్ట్ గా టీవీ స్క్రీన్స్ మీద చూపిస్తే… కుర్రకారు కాస్తంత కంగారు పడతారని అనుకున్నారేమో తెలియదు.

Read Also : లోబో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా!

పైగా మొదటి రోజే హమీదా కంట తడిపెట్టుకున్న సన్నివేశాలకు… ఈ సిగిరెట్ స్మోకింగ్ సీన్ కు సింక్ కాదని కూడా భావించి ఉండొచ్చు. అయితే… అన్ సీన్ ఎపిసోడ్ లో మాత్రం ఈ స్మోకింగ్ సీన్స్ ను బయటకు వదిలేశారు. ఓ పక్క లోబో మరో పక్క హమీదా, సరయు దమ్ము కొడుతుంటే… ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్, ఇట్స్ కాజెస్ క్యాన్సర్’ అనే మాటలు వీక్షకుల చెవుల్ని చేరి ఉంటాయో లేదో పాపం! రెండు రోజులకే మూడుకు చేరిన స్మోకింగ్ పర్సన్స్ సంఖ్య రాబోయే రోజుల్లో ఎంతకి పెరుగుతుందో వేచి చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-