పవన్ దర్శకుడు, మహేశ్ విలన్… ఓటీటీ డెబ్యూకి రెడీ!

‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి వచ్చి… ఆపై నటుడిగా మారిన ఎస్ జే సూర్య మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అయిపోతూ ఓటీటీ గడపతొక్కనున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాడట. మహేశ్ బాబు ‘స్పైడర్’ మూవీలో విలన్ గా నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూలై 18 నుంచీ తమిళనాడులోని నాగర్ కోయిల్, చెన్నైలలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. నలభై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న సూర్య డెబ్యూ వెబ్ సిరీస్ కి ఆండ్రూ లూయిస్ దర్శకుడు. 2019లో ఆయన ‘కొలైగరన్’ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఎస్ జే సూర్య నటించనున్న తొలి వెబ్ సిరీస్ కి మరో విశేషం కూడా ఉంది. ‘విక్రమ్ వేద’ సినిమాకి తమిళంలో దర్శకత్వం వహించి… ప్రస్తుతం హిందీలోనూ సేమ్ మూవీని రీమేక్ చేస్తోన్న దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-