“బీస్ట్” కోసం లిరిసిస్ట్ గా మారుతున్న హీరో

విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్ సహాయక పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం నటుడు శివకార్తికేయన్ “బీస్ట్” కోసం లిరిక్ రైటర్ గా మారుతున్నారు. ఈ సినిమాలోని ఓ పాటకు లిరిక్స్ అందించబోతున్నాడట శివకార్తికేయన్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also : పుష్ప : “దాక్కో దాక్కో మేక” సాంగ్ వచ్చేసింది !

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, శివకార్తికేయన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ముగ్గురూ మంచి సన్నిహితులు. అనిరుధ్ రవిచందర్, శివకార్తికేయన్ కాంబోలో ‘చెల్లమా’, ‘కళ్యాణ వయసు’, ‘సో బేబీ’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోవైపు శివకార్తికేయన్ టాలీవుడ్‌లో “జాతి రత్నాలు” డైరెక్టర్ కెవి అనుదీప్ దర్శకత్వంలో నిర్మితం కానున్న ఓ ద్విభాషా చిత్రంతో టాలీవుడ్ అరంగ్రేటం చేయనున్నారు.

Related Articles

Latest Articles