సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ కొత్త చిత్రం ప్రారంభం

ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అతనితోనే మరో చిత్రాన్ని మొదలు పెట్టింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి రమేశ్ కు అందచేశారు. అతనికి ఇదే మొదటి సినిమా. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో తమిళ నటుడు అర్జున్ దాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయని దర్శకుడు తెలిపాడు. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి స్వరాలు సమకూర్చుతున్నారు. పి.డి.వి. ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ కొత్త చిత్రం ప్రారంభం
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-