అన్ని రంగాల్లో మోడీ విఫలమయ్యారు: సీతారాం ఏచూరి

అన్ని రంగాల్లో ప్రధాని మోడీ విఫలమయ్యారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటితో ముగియనున్న సమావేశాలు. ఈ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించిన కేంద్ర కమిటీ. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్‌లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర కార్యవర్గం నిర్ణయించింది. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుత సమయంలో బీజేపీకి వ్యతిరేకత పెరిగిందన్నారు. బీజేపీ ఓటమి లక్ష్యంగా వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామన్నారు. 5 రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో ఓట్లలో చీలిక లేకుండా కలిసి పనిచేస్తామని ఏచూరి పిలుపునిచ్చారు.

Read Also:బీజేపీ అధికారంలోకి వస్తే జీవో 317ను బొందపెడతాం: బండి సంజయ్‌

ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానితో సహా.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా బీజేపీ పన్నాగం పన్నుతుందని ఆరోపించారు. రాష్ట్రా ల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఈ నిర్ణయం ఉంటుందన్నారు. . పంజాబ్‌లో ప్రదాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదు. కానీ ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ ల్యాప్స్‌ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఏచూరి అన్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొంది: తమ్మినేని వీరభద్రం
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొని ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే వారితో ముందుకెళ్తాం అన్నారు. కేసీఆర్‌ బీజేపీని సూటిగా వ్యతిరేకించడం లేదన్నారు. కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ సాఫ్ట్‌ కార్నర్‌కు మేం వ్యతిరేకమని తమ్మినేని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles