స్టార్ హీరో మూవీతో సితార ఎంట్రీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ కిడ్ సినిమా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులలో వెండితెరపై సితారను చూడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒక స్టార్ హీరో సినిమా ద్వారా సితార బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఖరారైందని తెలుస్తోంది.

Read Also : కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకు పడ్డ మంచు విష్ణు

సెప్టెంబర్ 26న తలపతి విజయ్ 66 సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తర్వాత విజయ్ తన 66వ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సితారను సంప్రదించారని తాజా సమాచారం. విజయ్, వంశీ, దిల్ రాజు లకు మహేష్ బాబు సన్నిహితుడు కాబట్టి సితార ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు.

-Advertisement-స్టార్ హీరో మూవీతో సితార ఎంట్రీ

Related Articles

Latest Articles