దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించిన సిర్పూర్కర్‌ కమిషన్‌

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఎన్‌కౌంటర్‌ పై హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.ఈ కమిషన్‌ సభ్యులు ఆదివారం నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సిర్పూర్కర్‌ కమిషన్‌ ఈ ఎన్‌కౌంటర్‌ పై విచారణ చేస్తుంది. కరోనా కారణంగా కమిషన్‌ విచారణ ఆలస్యమైంది. దీంతో కమిషన్‌కు సుప్రీం కోర్టు గడువును పెంచింది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్‌ కమిషన్‌ పరిశీలిచింది.

ఇదే ప్రాంతంలో 2019 నవంబర్‌27న వెటర్నరీ డాక్టర్‌ దిశపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి కాల్చారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులతో పాటు నాటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా కమిషన్‌ విచారించింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంది. కాల్పులకు ఎవ్వరూ ఆదేశాలు జారీ చేశారని కూడా కమిషన్‌ సభ్యులను ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించింది.

సిర్పూర్కర్‌ కమిషన్‌కు నిరసన సెగ..
షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను కమిషన్‌ సభ్యలు పరిశీలించారు. దుర్మార్గులను ఎన్‌కౌంటర్‌ చేస్తే తప్పేంటని స్థానికులు కమిషన్‌ సభ్యలను ప్రశ్నించారు. సిర్పూర్కర్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిశ నిందితులను శిక్షించాలని గతంలో నిరసన చేపట్టిన మాపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారని స్థానికులు గుర్తు చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న హెడ్‌ కానిస్టేబుల్‌ను ప్రశ్నించింది. నిందితులు చనిపోయిన స్థలంలో ఎక్కువగా గడ్డితో నిండి ఉందని, దీంతో పోలీసుల కళ్లలో మట్టి ఎక్కడ కొట్టారో విషయమై సిర్పూర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో తీసిన ఫోటోలను కమిషన్‌ సభ్యులు కానిస్టేబుల్‌కు చూపెట్టారు. దిశపై అత్యాచారం చేసిన మహ్మద్‌ అరిఫ్‌, జొల్లు శివ, నవీన్‌, చెన్నకేశవులు 2019 డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

దిశపై అత్యాచారం హత్య చేసిన ఘటన స్థలంలో సీన్‌ రీ కన్‌స్ర్టక్షన్‌ చేసే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని అప్పట్లో సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ పై హక్కుల సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు వారంలోపులోనే సిర్పూర్కర్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు సుప్రీం కోర్టు మాజీ రిటైర్డ్‌ జడ్జి సిర్పూర్కర్‌ నేతృత్వం వహిస్తున్నారు. సీబీఐ మాజీ చీఫ్‌ డిఆర్‌ కార్తికేయన్‌, ముంబై హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఈ కమిటిలో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు కమిషన్‌ తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేయనుంది.

Related Articles

Latest Articles