“ప్రేమ కాదంట”… అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. “ప్రేమ కాదంట” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ టైటిల్ ను తెలుపుతూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లలో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ ఆసక్తికరంగా ఉంది. ఒక పోస్టర్ లో అనును శిరీష్ ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకుంటున్నారు. మరో పోస్టర్లో ప్రేమలో మునిగి తేలుతున్నారు. “ప్రేమ కాదంట” చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. GA2 మూవీస్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్, అచు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా అర్బన్ రిలేషన్ షిప్స్ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీ లుక్స్ తోనే సినిమాపై బజ్ పెరిగిపోయింది. దీంతో అప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-